అయోధ్య రామమందిరానికి భక్తులు సమర్పించిన విరాళాల నిర్వహణలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కోర్టుకు తెలియజేయడంతో, సర్వోన్నత న్యాయస్థానం తదుపరి విచారణను సంబంధిత న్యాయస్థానానికి బదిలీ చేసింది.
సోమవారం ( ) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జాయ్మాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ చేపట్టింది. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ పూర్తి చేసి ఛార్జ్‌షీట్ దాఖలు చేసిందని కేంద్ర, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాల తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనానికి వివరించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
దర్యాప్తు వివరాలు
రామమందిరంలో భక్తులు సమర్పించిన నగదును లెక్కించే సమయంలో కొందరు సిబ్బంది అక్రమాలకు పాల్పడినట్లు దర్యాప్తులో గుర్తించామని ఆయన ధర్మాసనానికి తెలిపారు. నిందితుల బ్యాంకు ఖాతాలు, గత ఆర్థిక లావాదేవీలను పరిశీలించడంతో పాటు, కొందరు ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించామని కోర్టుకు వివరించారు.












