దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ఆందోళనకరంగా మారింది. మంగళవారం ఉదయం 8 గంటలకు నగరం మొత్తం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ () 451కి చేరింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు () ప్రకారం ఇది తీవ్ర కాలుష్య స్థాయి. కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ () రెండో దశ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి.
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత తీవ్రమైంది. మంగళవారం ఉదయం 8 గంటలకు నగరం మొత్తం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ () 451కి చేరినట్లు నివేదికలు వెల్లడించాయి. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు () ప్రమాణాల ప్రకారం ఇది తీవ్ర () కాలుష్య స్థాయి. రోహిణి, పంజాబీ బాగ్, బవానా ప్రాంతాల్లోనూ గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరింది. కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ () రెండో దశ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
నగరంలోని పలు ప్రాంతాల్లో కాలుష్య స్థాయులు మరింత ఎక్కువగా నమోదయ్యాయి. రోహిణిలో 429, పంజాబీ బాగ్‌లో 424, బవానాలో 408 నమోదైంది. పట్పర్గంజ్లో 379, ఆర్కే పురంలో 374, ఐటీఓలో 373, జవహర్లాల్ నెహ్రూ స్టేడియం ప్రాంతంలో 355, ఓఖ్లా ఫేజ్-2లో 352గా గాలి నాణ్యత సూచీ నమోదైంది.












