మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడటంతో పాటు, బాలల లైంగిక వేధింపులకు సంబంధించిన అశ్లీల సమాచారాన్ని సేకరించి, ప్రసారం చేసిన కేసులో నిందితుడు శ్యామ్ బిహారీకి మథుర ప్రత్యేక పోక్సో కోర్టు జీవిత ఖైదు విధించింది. అతనికి రూ.1.43 లక్షల జరిమానా కూడా విధించింది. ఈ విషయాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ () వెల్లడించింది.
మథురలోని ప్రత్యేక పోక్సో న్యాయస్థానం శ్యామ్ బిహారీని దోషిగా నిర్ధారించింది. నిందితుడిపై పోక్సో చట్టం 2012, భారతీయ శిక్షాస్మృతి (), సమాచార సాంకేతిక చట్టం 2000 కింద అభియోగాలు నమోదయ్యాయి. మైనర్ బాలికపై అత్యాచారం, తీవ్రమైన లైంగిక దాడి, చిన్నారిని అశ్లీల ప్రయోజనాల కోసం ఉపయోగించడం, బాలల లైంగిక వేధింపులకు సంబంధించిన సమాచారాన్ని తన వద్ద ఉంచుకోవడం వంటి నేరాల్లో కోర్టు అతడిని దోషిగా తేల్చింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
డిజిటల్ నేరాల దర్యాప్తు
ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా బాలల లైంగిక వేధింపులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం, ప్రసారం చేయడం, ప్రచురించడం వంటి ఆరోపణలపై 2017లో కేసు నమోదు చేసింది. దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో నిందితుడు ఓ మైనర్ బాలికపై తీవ్రమైన లైంగిక దాడికి పాల్పడిన విషయం కూడా బయటపడింది.












