మురసు తుపాను కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఫోన్లో మాట్లాడారు. తుపాను ప్రభావం, రాష్ట్రంలో జరిగిన నష్టం, బాధితులకు అందిస్తున్న సహాయక చర్యల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (), రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం () బృందాలు రంగంలోకి దిగినట్లు అమిత్ షా తెలిపారు. బాధిత ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందించడంతో పాటు సహాయక, పునరావాస చర్యలు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
వరుస తుపానుల కారణంగా రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యాన పంటలు, విద్యుత్ వ్యవస్థ, రహదారులు, ఇతర ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాన్ని పంపినందుకు చంద్రబాబు నాయుడు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో పునరుద్ధరణ, సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు తగిన ఆర్థిక సహాయం అందించాలని కోరారు.












