సంగీత కచేరీలు, ఇతర కార్యక్రమాలకు అనుమతులు ఇచ్చేటప్పుడు మద్యం విక్రయాలు లేదా వినియోగంపై నిషేధం విధించే అధికారం పోలీసులకు లేదని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. శబ్ద కాలుష్య నియంత్రణ నిబంధనల కింద పోలీసులు విధించిన ఆంక్షలు చట్టవిరుద్ధమని న్యాయస్థానం పేర్కొంది.
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో నిర్వహించనున్న ఒక సంగీత కార్యక్రమానికి పోలీసులు 18 షరతులతో అనుమతి ఇచ్చారు. అయితే, కార్యక్రమంలో మద్యం లేదా ఇతర మత్తు పదార్థాలు వడ్డించకూడదని 18వ షరతు విధించారు. దీనిని సవాలు చేస్తూ అట్లానీ బ్రదర్స్ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ పిటిషన్‌పై జస్టిస్ అలోక్ మాథుర్, జస్టిస్ అబ్ధేష్ కుమార్ చౌధరి ధర్మాసనం విచారణ చేపట్టింది. శబ్ద కాలుష్య నియంత్రణ నిబంధనలు2000 ప్రకారం, పారిశ్రామిక, వాణిజ్య, నివాస, నిశ్శబ్ద ప్రాంతాల్లో శబ్ద తీవ్రతను నియంత్రించడమే అధికారుల బాధ్యత అని ధర్మాసనం పేర్కొంది. మద్యం వంటి మత్తు పదార్థాల విక్రయాలు లేదా వినియోగానికి అనుమతి ఇవ్వడం, నిరాకరించడం గురించి ఈ నిబంధనల్లో ఎలాంటి అధికారం కల్పించలేదని స్పష్టం చేసింది.












