ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ల పంపిణీ విధానంలో కీలక మార్పులు చేసింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఇకపై రెండు విడతల్లో లబ్ధిదారులకు అందజేస్తారు. ఈ మార్పులు తక్షణమే అమల్లోకి వస్తాయి.
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. పింఛన్ మొత్తాన్ని రెండు భాగాలుగా విభజించి పంపిణీ చేస్తారు. కేంద్ర ప్రభుత్వం వాటా ( షేర్) నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వ వాటా మాత్రం ఎప్పటిలాగే సచివాలయ సిబ్బంది ఇంటి వద్దకే వచ్చి నగదు రూపంలో అందజేస్తారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పింఛన్ మొత్తం ఏమాత్రం తగ్గదని ప్రభుత్వం స్పష్టం చేసింది. లబ్ధిదారులకు పూర్తి మొత్తం రూ.4000 లేదా రూ.6000 యథావిధిగా అందుతుందని అధికారులు తెలిపారు.












