మున్సిపల్ రంగంలో పనిచేస్తూ మరణించిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కడపలో మున్సిపల్ కార్మికులు సోమవారం పాదయాత్ర చేపట్టారు. అధికారులు నాలుగేళ్లుగా ఈ విషయంలో కాలయాపన చేస్తున్నారని వారు ఆరోపించారు.
రాష్ట్రవ్యాప్తంగా వంద మందికి పైగా మున్సిపల్ కార్మికులు విధులు నిర్వహిస్తూ మరణించగా, కడప నగరంలోనే 18 మంది మరణించారని యూనియన్ నేతలు తెలిపారు. వారి కుటుంబాలకు ఉద్యోగం ఇవ్వాలని కోరుతూ అనేకసార్లు వినతిపత్రాలు సమర్పించినా, ధర్నాలు చేసినా ఫలితం లేకపోవడంతో ఈ పాదయాత్ర చేపట్టారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
సోమవారం ఉదయం 8 గంటలకు చెన్నై రోడ్డులోని వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి సర్కిల్ వద్ద పాదయాత్ర ప్రారంభమైంది. ఆర్.కె. నగర్, పాత బైపాస్, చిన్న చౌక్, అప్సర సర్కిల్, కృష్ణా సర్కిల్, సెవెన్ రోడ్స్ సర్కిల్, ఇందిరమ్మ సర్కిల్, ఎన్.టి.ఆర్. సర్కిల్, సి.ఎస్.ఐ. హైస్కూల్, కోటిరెడ్డి సర్కిల్ మీదుగా కార్పొరేషన్ కార్యాలయం వరకు సాగి, అక్కడ జరిగిన ముగింపు సభతో ముగిసింది.












