కడప జిల్లా సిద్ధవటం సిద్ధవటం మండలం టక్కోలి గ్రామంలో బువారం ప్రత్యేక యూనిట్ సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌ల ఆదేశాల మేరకు, రాజంపేట ఇంచార్జ్ జగన్ మోహన్ రాజు సమక్షంలో ఈ సమావేశం జరిగినట్లు నాయకులు తెలిపారు. గ్రామంలోని మౌలిక వసతులు, అభివృద్ి సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు.
సీసీ రోడ్ల నిర్మాణం: టక్కోలి ఎస్సీ కాలనీ, బీసీ కాలనీల్లో సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు, టక్కోలి శ్మశాన వాటిక దారిలో మరియు కాజీపల్లె శ్మశాన దారిలో కూడా సీసీ రోడ్లు నిర్మించాలని నిర్ణయించారు. కాలనీల్లో రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వర్షాకాలంలో బురదతో నడవలేని పరిస్థితి ఉందని గ్రామస్థులు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
తాగునీటి సౌకర్యం: డేగనవాండ్ల పల్లెలో హైలెవెల్ ట్యాంక్ నిర్మాణంతో పాటు ఏటి నుండి పైప్‌లైన్ మరియు మోటార్ ఏర్పాటు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.











