మంగళగిరిలో ఓ యువతిపై అత్యాచారం జరిగిన ఘటన కలకలం రేపింది. ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన యువకుడు, రీల్స్ తీస్తానని చెప్పి మంగళగిరికి పిలిపించి, మత్తుమందు ఇచ్చి, న్యూడ్ ఫోటోలు తీసి అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు ఆరోపించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కడప జిల్లాకు చెందిన యువతికి ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ యువకుడు పరిచయమయ్యాడు. రీల్స్ తీయాలనే నెపంతో ఆమెను మంగళగిరికి రప్పించుకున్నాడు. అక్కడికి చేరుకున్న తర్వాత, యువతిని ఒక లాడ్జికి తీసుకెళ్లి, మత్తుమందు ఇచ్చి, ఆమె న్యూడ్ ఫోటోలు తీసి అత్యాచారం చేసినట్లు బాధితురాలు కడప పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
బాధితురాలి ఫిర్యాదు మేరకు, కడప పోలీసులు నిందితుడిపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే, ఈ ఘటన మంగళగిరి పరిధిలో జరిగినందున, కేసును మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.












