వైఎస్ఆర్ జిల్లా పోలీస్ శాఖకు నూతన జాగిలం జానీ చేరింది. మంగళగిరి పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుండి జిల్లాకు వచ్చిన ఈ కొత్త జాగిలాన్ని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పరిశీలించారు. బెల్జియం మలనాయిస్ జాతికి చెందిన జానీ 10 నెలల పాటు శిక్షణ పొందింది.
మంగళగిరి 6వ బెటాలియన్ లోని కెనైన్ ట్రైనింగ్ సెంటర్ లో శిక్షణ పొందిన జానీ, మాదక ద్రవ్యాలను పసిగట్టడంలో, నేర పరిశోధనలో ట్రాకర్, నార్కోటిక్స్ విభాగాల్లో క్లూ ఇవ్వడంలో దిట్టగా మారింది. శిక్షణలో ప్రతిభ కనబరిచి తృతీయ స్థానంలో నిలిచి కాంశ్య పతకం సాధించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయానికి చేరుకున్న జానీకి ఎస్పీ కాంస్య పతకాన్ని అందజేసి, నగదు బహుమతితో సత్కరించి, ప్రత్యేకంగా అభినందించారు.












