తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజలను వ్యక్తిగతంగా కలిసి వారి సమస్యలపై అర్జీలను స్వీకరించిన మంత్రి, వాటి పరిష్కారానికి అధికారులకు సూచనలు చేశారు.
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈరోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజలను వ్యక్తిగతంగా కలిసి వారి నుండి వచ్చిన అర్జీలను స్వీకరించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను మంత్రికి విన్నవించుకున్నారు. ముఖ్యంగా రవాణా శాఖ, క్రీడా శాఖకు సంబంధించిన సమస్యలతో పాటు వ్యక్తిగత, భూ సమస్యలు, ఉద్యోగాలకు సంబంధించిన వినతులు అందాయి.












