స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్, నగరపాలక కమిషనర్ జిల్లా అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని, అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ సమన్వయకర్తగా వ్యవహరిస్తారని తెలిపారు. మేయర్, చైర్ పర్సన్ స్థానాలకు నేరుగా ఎన్నికలు జరగనున్నందున అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
సిబ్బంది, ఎన్నికల సామగ్రి, పోలింగ్ కేంద్రాల ఏర్పాటును ముందుగానే సిద్ధం చేయాలని సూచించారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాన్ని అరికట్టాలని, ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.











