వై.ఎస్.ఆర్ కడప, 10 November
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్-2 పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో పోస్టుల సంఖ్య 686 నుంచి 720కి పెరిగింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మొత్తం 720 పోస్టుల్లో 471 ఎగ్జిక్యూటివ్, 249 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటిలో 203 డిప్యూటీ తహసీల్దార్, 176 డిప్యూటీ ఎంపీడీవో పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా 40 జీఎస్టీ ఆఫీసర్, 29 ఎక్సైజ్ ఎస్ఐ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు.












