వై.ఎస్.ఆర్ కడప, 26 September
చిత్తూరు జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో 9 నెలల ప్రాథమిక శిక్షణ పూర్తి చేసుకున్న 142 మంది ట్రైనీ కానిస్టేబుళ్ల దీక్షాంత్ పరేడ్ శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో 9 నెలల ప్రాథమిక శిక్షణ పూర్తి చేసుకున్న 142 మంది ట్రైనీ కానిస్టేబుళ్ల దీక్షాంత్ పరేడ్ శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రవాణా, యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హాజరై గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ తుషార్ డూడి గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. ఈ బ్యాచ్‌లో శ్రీకాకుళం నుంచి 61 మంది, విజయనగరం నుంచి 81 మంది శిక్షణ పూర్తి చేసుకున్నారు.












