బాలీవుడ్ యువ నటుడు అహాన్ శెట్టి హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం సంకీ. ఇందులో బోర్డర్ 2లో కలిసి నటించిన మేధా రాణా హీరోయిన్గా కనిపించనున్నారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది.
బాలీవుడ్ యువ నటుడు అహాన్ శెట్టి మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి సంకీ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో బోర్డర్ 2లో కలిసి నటించిన మేధా రాణా హీరోయిన్గా కనిపించనున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
దర్శకుడు టిను సురేశ్ దేశాయ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రేమకథతో పాటు భావోద్వేగాలు, యాక్షన్ అంశాలతో రూపొందుతోంది. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో చిత్రీకరణ జరుగుతోంది. షూటింగ్లో అహాన్ శెట్టితో పాటు మేధా రాణా కూడా పాల్గొననున్నారు.












