అమరావతి, జూన్ 29
అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సచివాలయంలో కాంట్రాక్టు సంస్థలతో సమీక్ష నిర్వహించారు. దేశం గర్వించే రాజధానిగా అమరావతిని నిర్మిస్తున్నామని, నిర్మాణ పనుల్లో మరింత వేగం పెంచాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.
అమరావతిలో నిర్మాణ పనుల పురోగతిపై సచివాలయంలో కాంట్రాక్టు సంస్థలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంగళవారం సమీక్ష నిర్వహించారు. దేశం గర్వించే రాజధాని నగరంగా అమరావతిని నిర్మిస్తున్నామని, నిర్మాణ పనుల్లో మరింత వేగం పెంచాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.
ప్రస్తుతం రూ.50,999 కోట్ల విలువైన హౌసింగ్, ట్రంక్ ఇన్ ఫ్రా, ఎల్పీఎస్ ఇన్ ఫ్రా, అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ టవర్ల వంటి ఐకానిక్ భవనాల నిర్మాణ ప్రాజెక్టులు వేగంగా సాగుతున్నాయి. ఈ పనుల్లో 26,924 మంది కార్మికులు, 5,140కి పైగా భారీ యంత్రాలు నిమగ్నమై ఉన్నాయి.
కొందరు వ్యక్తులు కావాలని లిటిగెంట్లుగా మారి రాజధాని పనులను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారని, అయితే రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు వెళ్లాలని సీఎం స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో మంత్రి పి. నారాయణ, ఉన్నతాధికారులు, ఎల్ అండ్ టీ, షాపూర్ జీ పల్లోంజి, మెగా ఇంజినీరింగ్, ఎన్సీసీ, బీఎస్ఆర్, కేఎంవీ సహా వివిధ కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.












