కర్నూలు, జూన్ 29
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలపై త్వరితగతిన స్పందించి, పరిష్కారం చూపాలని పోలీసు అధికారులను కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశించారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 101 ఫిర్యాదులు స్వీకరించారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించి, పరిష్కరించాలని పోలీసు అధికారులను కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశించారు.
కర్నూలు కొత్తపేటలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్కన ఉన్న ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన ఈ సూచనలు చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలను, వినతులను స్వీకరించిన ఎస్పీ, ఫిర్యాదిదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమానికి మొత్తం 101 ఫిర్యాదులు వచ్చాయి. వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా, సీఐలు శివశంకర్, ఇస్మాయిల్, మస్తాన్ వలి పాల్గొన్నారు.












