వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. పట్టణంలో పేకాట, జూదం నిర్వహిస్తున్న స్థావరంపై ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీసులు శుక్రవారం దాడి చేసి ఆరుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.22,870 నగదు, 52 పేకముక్కలను స్వాధీనం చేసుకున్నారు.
ప్రొద్దుటూరు పట్టణంలో పేకాట, మట్కా వంటి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని ప్రొద్దుటూరు ఏఎస్పీ విభూ కృష్ణ, ఐపీఎస్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో వన్ టౌన్ ఇన్స్పెక్టర్ టీవీ కొండారెడ్డి పర్యవేక్షణలో ఎస్ఐ మధుసూదన్ రెడ్డి, సిబ్బందితో కలిసి శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో రామేశ్వరం రోడ్డులోని సాయిబాబా గుడి వెనుక ఉన్న ఖాళీ స్థలంలో తనిఖీలు నిర్వహించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అరెస్టులు, స్వాధీనం












