కడప జిల్లా మండలంలో విద్యాశాఖ తీరు వివాదాస్పదంగా మారింది. పీఎం శ్రీ పాఠశాల పర్యవేక్షణకు వచ్చిన ఐఏఎస్ అధికారి రజత్ కుమార్ షైనీ పర్యటన సందర్భంగా విద్యాశాఖ అధికారులు మీడియాపై ఆంక్షలు విధించారు. పాఠశాల లోపలికి మీడియాను అనుమతించకపోవడంపై జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జడ్పీ ఉన్నత పాఠశాలలో పీఎం శ్రీ పాఠశాల పర్యవేక్షణకు ఐఏఎస్ అధికారి రజత్ కుమార్ షైనీ పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులు మీడియాపై ఆంక్షలు విధించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఐఏఎస్ అధికారి పాఠశాలను సందర్శిస్తున్న నేపథ్యంలో మీడియా ప్రతినిధులు ఎవరూ లోపలికి రాకూడదంటూ విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాఠశాల వద్దకు వచ్చిన జర్నలిస్టులను గేటు వద్దనే అడ్డుకున్నారు.












