జిల్లా: రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని, రాజంపేట శాసనసభ్యులు మరియు జిల్లా పార్టీ అధ్యక్షులు అకేపాటి అమర్నాథ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంపీ నివాసంలో జరిగిన ఈ భేటీలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు.
రాజంపేట పార్లమెంట్ పరిధిలోని అభివృద్ధి పనులు, పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల పురోగతిపై వారు ప్రధానంగా దృష్టి సారించారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చించినట్లు సమాచారం.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందని, ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా నాయకులు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సంక్షేమ పథకాల అమలులో జరుగుతున్న జాప్యంపై కూడా వారు చర్చించినట్లు తెలుస్తోంది.











