పేద ప్రజలకు ప్రభుత్వం పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా సేకరించి ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ అధిక లాభాలు ఆర్జిస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు సీహెచ్ నరసింహులు డిమాండ్ చేశారు. ఈ అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆయన కోరారు.
సోమవారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాల ద్వారా పేదలకు అందాల్సిన బియ్యాన్ని కొందరు వ్యాపారులు అక్రమంగా కొనుగోలు చేసి, రైస్ మిల్లుల్లో పాలిష్ చేసి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు. దీనిపై సంబంధిత ప్రభుత్వ అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అధికారులకు విజ్ఞప్తి












