కామారెడ్డి జిల్లాలో వరుసగా ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి రాగి తీగలు చోరీ చేస్తున్న అంతర్రాష్ట్ర నిందితుడు సత్నామ్ సింగ్ చందూ సింగ్ బావరి (39)ను బిచ్కుంద పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని జిల్లా జరి ప్రాంతానికి చెందిన ఇతను, తన బావమరిది షంషేర్ సింగ్‌తో కలిసి మొత్తం 19 ట్రాన్స్ఫార్మర్ చోరీ కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
గోపన్‌పల్లి శివారులోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలో ట్రాన్స్ఫార్మర్ను ధ్వంసం చేసి రాగి తీగలు, బుష్ రాడ్లు, విద్యుత్ నూనె చోరీ చేసిన ఘటనపై కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు, బాన్సువాడ డీఎస్పీ పి. విఠల్ రెడ్డి పర్యవేక్షణలో బిచ్కుంద సీఐ రవికుమార్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ సంతోష్ గౌడ్, ఎస్ఐ గుండెల రాజు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి.












