కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2001-2002 విద్యా సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థులు తమ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధికి కృషి చేసిన ఉపాధ్యాయులకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకోవడం ద్వారా ఎంతోమంది విద్యార్థులు ఉపాధ్యాయులుగా, వైద్యులుగా, నర్సులుగా, ల్యాబ్ టెక్నీషియన్లుగా వివిధ రంగాలలో ఉన్నత స్థానాలకు చేరుకున్నారని పూర్వ విద్యార్థులు తెలిపారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో లింగం, నర్సింలు, రామకృష్ణ, రాజు, మీసాల రవికుమార్, సురేష్, నరేష్, కృష్ణ స్వామి, రవి, రజిత, సరిత, కళావతి, జయంతి, వరలక్ష్మి, ప్రమీల, పద్మ, శ్యామల తదితర పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పాత స్నేహితులు ఒకరినొకరు కలుసుకుని ఆనందంగా గడిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి











