స్థలం వివాదం కాస్తా సామాజిక బహిష్కరణ వరకు వెళ్లిందని, పండుగలు, శుభకార్యాలకు తమ కుటుంబాన్ని పిలవడం లేదని బాధితుడు దర్నీ పోచయ్య ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదని ఆయన వాపోయారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా మండలంలో చోటుచేసుకుంది.
కామారెడ్డి జిల్లా గ్రామానికి చెందిన దర్నీ పోచయ్య తనకు కేటాయించిన ఇంట్లో నివాసం ఉంటున్నారు. పక్కనే నివసించే రెండు కుటుంబాలతో స్థలం, దారి విషయంలో గత కొంతకాలంగా వివాదం కొనసాగుతోందని ఆయన తెలిపారు. ముగ్గురు కుటుంబాలకు ఒకే దారి ఉండగా, తన రాకపోకలకు అడ్డుగా గోడ నిర్మించారని పోచయ్య ఆరోపించారు. ఇంటి వద్ద బాత్రూమ్ నిర్మించుకోవడానికి సైతం అడ్డుకున్నారని తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ఈ విషయంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, కుల పెద్దల సమక్షంలో మాట్లాడుకోవాలని సూచించినట్లు బాధితుడు పేర్కొన్నారు. అయితే కుల పెద్దల సమక్షంలో జరిగిన చర్చల్లో ఏకపక్షంగా వ్యవహరించి తనకు 20 వేల జరిమానా విధించారని ఆరోపించారు. అప్పటి నుంచి తమ కుటుంబాన్ని కులంలో జరిగే పండుగలకు, శుభ, అశుభ కార్యక్రమాలకు పిలవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.












