రాజంపేట మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో, ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించాలని సబ్ కలెక్టర్ హెచ్.ఎస్. భావన సూచించారు. శుక్రవారం మన్నూరు జడ్పీ ఉన్నత పాఠశాలలోని ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని, పోలీసు బందోబస్తు పటిష్టంగా ఉండాలని, నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని ఆదేశించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పారదర్శక ఎన్నికలకు సూచనలు











