రాయచోటి నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నమయ్య జిల్లా మండలం బోరెడ్డిగారి పల్లెలోని తన స్వగృహంలో శనివారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు.
నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను మంత్రి నేరుగా కలిసి వారి సమస్యలు, వినతులను స్వీకరించారు. భూ సమస్యలు, పింఛన్లు, రోడ్లు, తాగునీరు, విద్యుత్ వంటి అనేక అంశాలపై ప్రజలు మంత్రికి వినతులు అందజేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రతి వినతిని స్వయంగా పరిశీలించిన మంత్రి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.











