తక్కువ పెట్టుబడితో కూరగాయల సాగు ద్వారా అధిక ఆదాయం పొందవచ్చని రైతు కోమిరెడ్డి అంజయ్య తెలిపారు. ఆయన సాగు చేస్తున్న మిర్చి, క్యాప్సికం తోటలను జిల్లా కలెక్టర్ శ్రీ ఆశిష్ సంగ్వాన్ సందర్శించి, రైతును ప్రశంసించారు. ఈ సందర్భంగా రైతు తన ఆదాయ వివరాలను వెల్లడించారు.
జిల్లా కలెక్టర్ శ్రీ ఆశిష్ సంగ్వాన్ గారు కోమిరెడ్డి అంజయ్య గారు సాగు చేస్తున్న మిర్చి మరియు క్యాప్సికం తోటలను సందర్శించి, పంటల సాగు విధానం, దిగుబడి, మార్కెటింగ్, రైతుకు వస్తున్న ఆదాయం తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ సందర్భంగా రైతు కోమిరెడ్డి అంజయ్య మాట్లాడుతూ, తాను గత మూడు సంవత్సరాలుగా క్యాప్సికం పంటను సాగు చేస్తున్నట్లు తెలిపారు. ఒక ఎకరా విస్తీర్ణంలో క్యాప్సికం సాగు చేసి సుమారు 30 టన్నుల దిగుబడి సాధించినట్లు వెల్లడించారు. పండించిన పంటను టన్నుకు రూ.40,000 చొప్పున విక్రయించగా, మొత్తం రూ.12 లక్షల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. సాగు ఖర్చులు, వ్యయాలు పోను సుమారు రూ.10 లక్షల వరకు నికర ఆదాయం పొందినట్లు సంతోషం వ్యక్తం చేశారు.












