బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో 61వ రోజు ఎపిసోడ్లో ఇంటి సభ్యుల మధ్య గొడవలు, భావోద్వేగాలు, ఫ్యామిలీ వీక్ అవకాశం కోసం పోటీ ఆసక్తికరంగా సాగాయి. కెప్టెన్సీ టాస్క్‌లో వంశీ విజయం సాధించి కొత్త కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ముకేష్ కోసం వర్షిణి తన కుటుంబ సభ్యులను కలిసే అవకాశాన్ని త్యాగం చేయడం ఎపిసోడ్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
హౌస్‌లో ఆహారం వృథా చేస్తున్నారనే అంశంపై త్రిగుణ్, వర్షిణి మధ్య వాగ్వాదం జరిగింది. వర్షిణి గతంలో టీ తీసుకుని తాగకుండా వదిలేయడంతో పాటు ఆహారాన్ని వృథా చేస్తోందని త్రిగుణ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీంతో ఆమెకు ఉదయం టీ ఇవ్వకుండా శిక్ష విధించాడు. దీనిపై వర్షిణి ఆగ్రహం వ్యక్తం చేసింది. తనకు మాత్రమే శిక్షలు విధిస్తున్నారని, ఇతరులు చేసిన తప్పులను పట్టించుకోవడం లేదని ప్రశ్నించింది. ఈ వివాదంలో ముకేష్ కూడా వర్షిణికి మద్దతుగా నిలవడంతో త్రిగుణ్‌తో వాగ్వాదం మరింత పెరిగింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఫ్యామిలీ వీక్ కోసం మరో అవకాశం
వచ్చే వారం జరగనున్న ఫ్యామిలీ వీక్‌లో తమ కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు బిగ్‌బాస్ మరో అవకాశం కల్పించాడు. గతంలో రివెంజ్ అండ్ రివార్డ్ టాస్క్‌లో ఓడిపోయి కుటుంబ సభ్యులను కలిసే అవకాశాన్ని కోల్పోయిన ఆర్కే, అమన్, ముకేష్, వర్షిణికి ప్రత్యేక టాస్క్ ఇచ్చాడు. ఆర్కే, అమన్ ఒక జంటగా, ముకేష్, వర్షిణి మరో జంటగా ఏర్పడ్డారు. ఈ రెండు జంటలు పోటీపడగా గెలిచిన జంటలో ఒక్కరికి మాత్రమే కుటుంబ సభ్యులను కలిసే అవకాశం ఉంటుందని బిగ్‌బాస్ ప్రకటించాడు.











