బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) వివిధ విభాగాల్లో 205 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. స్కేల్-1 నుంచి స్కేల్-4 వరకు ఆఫీసర్, మేనేజర్, సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్ స్థాయి పోస్టులు ఉన్నాయి. ఈ నియామకానికి ఆన్లైన్ దరఖాస్తుల గడువు తో ముగిసింది.
మొత్తం 205 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో స్కేల్-1 (ఆఫీసర్) కింద 28 పోస్టులు, స్కేల్-2 (మేనేజర్) కింద 118 పోస్టులు, స్కేల్-3 (సీనియర్ మేనేజర్) కింద 49 పోస్టులు, స్కేల్-4 (చీఫ్ మేనేజర్) కింద 10 పోస్టులు కేటాయించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
వివిధ విభాగాల్లో ఖాళీలు
ఫుల్-స్టాక్ ఇంజినీరింగ్, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్, డేటా ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, డెవ్సెక్ఆప్స్, డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్, ఐటీ ఆర్కిటెక్చర్, లా, ఫైర్ సేఫ్టీ, సివిల్ ఇంజినీరింగ్, సెక్యూరిటీ వంటి పలు విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.











