చైనాలో వివో సంస్థ కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్ 6 5ను విడుదల చేసింది. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ ఫోన్ ధరను 1,599 చైనీస్ యువాన్లుగా (భారత కరెన్సీలో సుమారు రూ.22,500) నిర్ణయించింది.
ఇందులో 6.74 అంగుళాల హెచ్డీ ఎల్సీడీ డిస్ప్లే, 120 రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 16 ఆధారిత 6తో ఇది పనిచేస్తుంది. ఫోటోగ్రఫీ కోసం వెనుకవైపు 13 మెగాపిక్సెల్ కెమెరా, ముందువైపు 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు. ఈ ఫోన్లో 6,500 బ్యాటరీతో పాటు 15 ఛార్జింగ్ సదుపాయం ఉంది. 65 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్ కూడా కల్పించారు. ప్రస్తుతం చైనా మార్కెట్లో మాత్రమే విడుదలైన ఈ ఫోన్ భారత మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందనే విషయాన్ని వివో సంస్థ వెల్లడించలేదు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి










