ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కీలక ప్రశ్నలు అడిగింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఢిల్లీఎన్సీఆర్లో కాలుష్య సమస్యపై విచారణ చేపట్టింది.
పంట వ్యర్థాల దహనాన్ని అరికట్టేందుకు రైతులకు ముందుగానే గిట్టుబాటు ధర ప్రకటించాలని, గ్రామ పంచాయతీలకు పంట వ్యర్థాలను సేకరించే యంత్రాలు, అవసరమైన సదుపాయాలు కల్పించాలని ధర్మాసనం సూచించింది. ఢిల్లీలో కాలుష్యానికి పంట వ్యర్థాల దహనమే ఏకైక కారణం కాదని, ప్రైవేటు వాహనాల నుంచి వెలువడే పొగ కూడా ప్రధాన సమస్యగా మారిందని ధర్మాసనం అభిప్రాయపడింది. ముఖ్యంగా విలాసవంతమైన కార్ల వినియోగం, రహదారులపై వాహనాల రద్దీపై కూడా ధర్మాసనం ప్రశ్నలు లేవనెత్తింది. ప్రజా రవాణాను మెరుగుపరచడంతో పాటు తక్షణ, మధ్యకాలిక, దీర్ఘకాలిక చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని న్యాయస్థానం ప్రస్తావించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి











