గుజరాత్ రాజధాని గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మరోసారి తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. మొత్తం 44 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 38 స్థానాలను గెలుచుకుని కార్పొరేషన్‌పై పట్టు కొనసాగించింది. కాంగ్రెస్ పార్టీ ఐదు స్థానాల్లో విజయం సాధించగా, ఒక స్థానాన్ని స్వతంత్ర అభ్యర్థి గెలుచుకున్నారు.
గత ఎన్నికల్లో ఒక స్థానాన్ని గెలుచుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఈసారి ఖాతా తెరవలేకపోయింది. న జరిగిన పోలింగ్ ఓట్ల లెక్కింపును న నిర్వహించగా, ఫలితాలు వెల్లడయ్యాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి మూడు స్థానాలు తగ్గుదల
2021లో జరిగిన గాంధీనగర్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ 44 స్థానాలకు గాను 41 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్‌కు రెండు స్థానాలు, ఆప్‌కు ఒక స్థానం దక్కాయి. అయితే, తాజా ఎన్నికల్లో బీజేపీ బలం 41 నుంచి 38 స్థానాలకు తగ్గింది. మరోవైపు కాంగ్రెస్ తన స్థానాలను రెండింటి నుంచి ఐదుకు పెంచుకుంది. ఈ ఫలితాలతో బీజేపీ కార్పొరేషన్లో మెజారిటీని కొనసాగించినప్పటికీ, కాంగ్రెస్ తన ప్రాతినిధ్యాన్ని పెంచుకోవడం గమనార్హం.











