కూకట్పల్లి నియోజకవర్గంలోని గోపాలనగర్లో హైడ్రా బృందం భూ కబ్జాలపై చర్యలు చేపట్టింది. టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ బండి రమేష్ పర్యటన తర్వాత ఈ చర్యలు ప్రారంభమయ్యాయి.
గోపాలనగర్ ప్రాంతంలో ఈరోజు ఉదయం 7 గంటల నుంచి హైడ్రా బృందం విస్తృతంగా చర్యలు చేపట్టింది. 10 సంవత్సరాలుగా కబ్జాలకు గురైన విలువైన ప్రభుత్వ పార్కు స్థలాలను గుర్తించి, వాటిని కబ్జాల నుంచి విముక్తం చేసే కార్యక్రమాన్ని హైడ్రా అధికారులు విజయవంతంగా నిర్వహించారు.
బండి రమేష్ గారు సుమారు 15 రోజుల క్రితం గోపాలనగర్లో పర్యటించి, పార్కులపై జరుగుతున్న అక్రమ కబ్జాలను గుర్తించి, ఆ విషయాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కి తెలియజేసి, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కృషికి ఫలితంగా, హైడ్రా అధికారులు రంగంలోకి దిగి, కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కబ్జాల నుంచి విముక్తం చేశారు.
ఈ విజయవంతమైన చర్యలకు సంబంధించి స్థానిక కాంగ్రెస్ నాయకులు మరియు ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

