అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి సైనిక ఘర్షణలు తలెత్తకుండా నివారించాల్సిన బాధ్యత అమెరికాపైనే ఉందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్, ప్రధాన చర్చల ప్రతినిధి మహమ్మద్ బాఘర్ గాలిబాఫ్ స్పష్టం చేశారు. అమెరికా నుంచి మళ్లీ దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అదే సమయంలో తమ దేశం యుద్ధానికి సిద్ధంగా ఉందని హెచ్చరించారు.
ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ప్రసారం చేసిన వివరాల ప్రకారం, పార్లమెంట్లో ప్రసంగించిన గాలిబాఫ్, ఇరాన్ ఇప్పటికే దృఢమైన, తార్కికమైన ప్రతిస్పందన ఇచ్చిందని పేర్కొన్నారు. అయితే ఆయన ఏ చర్యను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారన్నది స్పష్టంగా తెలియలేదు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అమెరికా సైనిక చర్యలు
హోర్ముజ్ జలసంధిలోని కొన్ని ఇరాన్ లక్ష్యాలపై అమెరికా సైన్యం రక్షణాత్మక దాడులు నిర్వహించినట్లు అమెరికా అధికారి ఒకరు వెల్లడించారు. ఇరాన్ నుంచి అమెరికా ఆస్తులపై ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణుల ముప్పు ఉండటంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మరోవైపు, ఇరాన్‌లోని ఖేష్మ్ ద్వీపంలో పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు అక్కడి ప్రభుత్వ మీడియా పేర్కొంది.












