కృత్రిమ మేధస్సు () ఆధారిత మాల్వేర్ భవిష్యత్తులో కీలక మౌలిక సదుపాయాలపై సైబర్ దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని బ్రిటన్ జాతీయ సైబర్ భద్రతా కేంద్రం () హెచ్చరించింది. 2028 నాటికి విద్యుత్ కేంద్రాలు, విమానాశ్రయాలు, ఆసుపత్రుల వంటి అత్యవసర సేవల వ్యవస్థలపై ఆధారిత సైబర్ దాడులు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని అంచనా వేసింది.
సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు కూడా తమ దాడుల పద్ధతులను మార్చుకుంటున్నారని సంస్థ పేర్కొంది. గతంలో నిపుణుల సహాయం అవసరమైన కొన్ని క్లిష్టమైన సైబర్ దాడులను ఇప్పుడు సాధనాల సాయంతో వేగంగా నిర్వహించే అవకాశం ఉందని వివరించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ర్యాన్సమ్వేర్ దాడుల ముప్పు
ముఖ్యంగా ర్యాన్సమ్వేర్ దాడుల విషయంలో ప్రమాదకరంగా మారవచ్చని హెచ్చరించింది. ఈ దాడుల్లో హ్యాకర్లు కంప్యూటర్ వ్యవస్థల్లోని సమాచారాన్ని లాక్ చేసి, తిరిగి అందుబాటులోకి తీసుకురావడానికి డబ్బులు డిమాండ్ చేస్తారు. ఆసుపత్రులు, విద్యుత్ సరఫరా వ్యవస్థలు ఇలాంటి దాడులకు గురైతే ప్రజల రోజువారీ జీవితంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.












