కామారెడ్డి, 4 September
కామారెడ్డి లోక్సభప్రతిపక్షనాయకుడుభారీనిరసన..ఉత్తరాఖండ్లోనమోదైనఎఫ్ఐఆర్నువెంటనేఉపసంహరించుకోవాలనికామారెడ్డిపార్టీడిమాండ్చేసింది.జిల్లాకామారెడ్డికమిటీఆధ్వర్యంలోజిల్లాకేంద్రంలోఈమేరకులోనిరసనకార్యక్రమాన్నినిర్వహించారు.తెలంగాణప్రదేశ్కామారెడ్డికమిటీఅధ్యక్షుడుమహేష్కుమార్గౌడ్ఆదేశాలమేరకుఈనిరసనచేపట్టారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కామారెడ్డి లో కాంగ్రెస్ భారీ నిరసన.. రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ ఉపసంహరణకు డిమాండ్* జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై ఉత్తరాఖండ్‌లో నమోదైన ఎఫ్ఐఆర్ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ నిరసనకు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఏలే మల్లికార్జున్ మాట్లాడుతూ, రాజ్యాంగ విలువలు, సామాజిక న్యాయం, సమానత్వం, దళితుల గౌరవం కోసం ప్రశ్నించిన రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. అలాగే ఉత్తరాఖండ్‌లో కుల వివక్షకు పాల్పడిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పోరాటం వ్యక్తుల కోసం కాదని, రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక న్యాయం, సమానత్వం కోసం అని స్పష్టం చేశారు. నిరసన కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, టీపీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఐరేని సందీప్ కుమార్‌తో పాటు జిల్లా నలుమూలల నుంచి కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి మద్దతుగా, రాజ్యాంగ పరిరక్షణకు అనుకూలంగా నినాదాలు చేశారు.











