నందిపేట్ (డాక్సిన్ టైమ్స్) సెప్టెంబర్ 04
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నందిాయకత్వంలో తెలంగాణలో ప్రజా ప్రభుత్వం 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది. డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
నందిపేటలో కాంగ్రెస్ భారీ ర్యాలీ: ప్రజా పాలన 1000 రోజుల సంబరాలు తెలంగాణను అప్పులమయం చేసిన బీఆర్ఎస్కు ధర్నాలు చేసే నైతిక హక్కు లేదు జీవన్ రెడ్డి పిచ్చి కూతలు మానుకో.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయి, తేల్చుకుందాం: వినయ్ కుమార్ రెడ్డి సవాల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను సొంత ప్రయోజనాల కోసం తరలించిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణలో ప్రజా ప్రభుత్వం విజయవంతంగా 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వివేకానంద విగ్రహం నుండి అంబేద్కర్ చౌరస్తా మీదుగా కొత్త బస్టాండ్ వరకు పార్టీ శ్రేణులు, మహిళలతో కలిసి భారీ ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా కొత్త బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన సభలో ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్, బీజేపీ నాయకుల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఓర్వలేక ధర్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఊరూరా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తుంటే, బీఆర్ఎస్ తెచ్చిన డబుల్ బెడ్రూం ఇళ్లు ఎక్కడ పోయాయో ప్రజలు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. మహిళా సాధికారత: మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ ప్రభుత్వం ఆర్టీసీకి ప్రతినెలా 300 కోట్ల రూపాయలు (ఇప్పటివరకు సుమారు 10,000 కోట్ల రూపాయలు) చెల్లించింది. ఆరోగ్యశ్రీ పెంపు: గతంలో 5 లక్షల రూపాయలుగా ఉన్న ఆరోగ్యశ్రీ పరిమితిని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 10 లక్షల రూపాయలకు పెంచి పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని చేరువ చేసింది. రైతు సంక్షేమం: రైతు రుణమాఫీ కోసం 21 వేల కోట్లు విడుదల చేయడంతో పాటు, రైతు భరోసా రూపంలో రైతులకు పెద్దపీట వేశామని వివరించారు. రేషన్ కార్డులు & ఉపాధి: ప్రభుత్వం పేద మహిళల కోసం 15 లక్షల నూతన రేషన్ కార్డులు మంజూరు చేసిందని, నియోజకవర్గంలో బీసీ మహిళలకు 1,000, మైనార్టీ మహిళలకు 270 కుట్టుమిషన్లు త్వరలోనే పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. జీవన్ రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్: మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీరుపై వినయ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. "ప్రజలు సంక్షేమ ఫలాలతో సంతోషంగా ఉంటే జీవన్ రెడ్డి ఓర్వలేక కారుకూతలు కూస్తున్నాడు. బిడ్డ జీవన్ రెడ్డి ఖబర్దార్! వచ్చే ఎన్నికల్లో నీకు టికెట్ రావాలని నేనే కోరుకుంటున్నా. రా.. ఎన్నికల్లో పోటీ చేయి, నిన్ను ఓడించి నీ సంగతేంటో తేలుస్తా" అంటూ సవాల్ విసిరారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిపై విమర్శలు: ఆర్మూర్ నియోజకవర్గానికి ప్రభుత్వం 200 కోట్ల రూపాయలతో మంజూరు చేసిన సమీకృత గురుకుల పాఠశాలను (ఇంటిగ్రేటెడ్ స్కూల్) ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా తరలించారని ఆరోపించారు. పట్టణానికి అందుబాటులో ఉన్న పిప్రి డిగ్రీ కాలేజ్ వద్ద కాకుండా, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తన స్వార్థం కోసం, సొంత భూముల విలువ పెంచుకోవడానికే అంకాపూర్‌కు తరలించారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు, నియోజకవర్గ మండలాల సర్పంచుల ఫోరం అధ్యక్షులు, మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, బూత్ మరియు గ్రామ అధ్యక్షులు, ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్లు, మాజీ మండల అధ్యక్షులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.











