తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో నుంచి 9వ తేదీ వరకు మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రూ.9,053.48 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న 13 అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేయనున్నారు. రూ.46.08 కోట్లతో పూర్తయిన 10 ప్రభుత్వ భవనాలను కూడా ప్రారంభిస్తారు.
వ్యవసాయం, పరిశ్రమలు, రహదారులు, విద్య, మహిళా సాధికారత రంగాలకు ఈ పర్యటనలో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ అభివృద్ధి ప్యాకేజీలో అత్యధికంగా రూ.5,060 కోట్లతో కొత్త రేడియల్ రోడ్డు-2 నిర్మాణం చేపట్టనున్నారు. కోత్వాల్‌గూడ నుంచి నాచారం వరకు ఈ రహదారిని నిర్మించనున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రధాన ప్రాజెక్టులు
ఇతర ప్రధాన ప్రాజెక్టులలో రూ.2,100 కోట్లతో మహబూబ్నగర్నారాయణపేటకొడంగల్ ఎత్తిపోతల పథకం రెండో దశ, రూ.1,410 కోట్లతో 223 బీటీ రోడ్ల నిర్మాణం, రూ.123 కోట్లతో కొడంగల్‌లో వ్యవసాయ కళాశాల, రూ.118.80 కోట్లతో 10 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు, రూ.81 కోట్లతో లగచర్ల పారిశ్రామిక కారిడార్‌లో ఎకో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం ఉన్నాయి.












