అన్నమయ్య, 8 September
మదనపల్లెలో ప్రేమ పేరుతో మోసపోయామని ఆరోపిస్తూ, ఒక యువతి తన కుటుంబంతో కలిసి పోలీస్ స్టేషన్ వద్ద ఆవేదన వ్యక్తం చేసింది. న్యాయం జరగలేదని ఆరోపిస్తూ తండ్రి ఆత్మహత్యాయత్నం చేయగా, యువతి విషం తాగి ఆసుపత్రిలో చేరింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
బ్రేకింగ్ న్యూస్ జిల్లా మదనపల్లె *ప్రేమ పేరుతో మోసం: న్యాయం కోసం తండ్రి బిడ్డ ఆత్మహత్యకు యత్నం* మదనపల్లెలో ప్రేమ పేరుతో మోసపోయామని ఆరోపిస్తూ మంగళవారం శేషమహల్ శారదానగర్ కు చెందిన దివ్య కుటుంబంతో కలిసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది. శేషమహల్ కు చెందిన పెంజూరి చలమయ్య కుమారులు రోహిత్, లోహిత్ సాయి తనను, చెల్లెలు గీతికను మోసం చేశారని, తమలాగానే ఇంకా మరో 50 మంది యువతులు బాధితులుగా ఉన్నారని ఆరోపించింది. న్యాయం జరగలేదని తండ్రి ప్రసాద్ రెడ్డి పెట్రోల్ తో పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం దివ్య ఇంటికి వెళ్లి విషం తాగి యత్నించగా ఆమెను స్థానిక ఎమర్జెన్సీ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది..












