మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య, తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసి, అనంతరం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది.
భోపాల్‌లోని మాలిఖేడీ ప్రాంతంలో ఉన్న ఓ ఇంట్లో మహిళ, ఇద్దరు పిల్లలు సహా నలుగురి మృతదేహాలను పోలీసులు గుర్తించారు. మృతుల గొంతులపై పదునైన ఆయుధంతో కోసిన గాయాలు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ ఘటన ఛోలా మందిర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మరోవైపు సుఖి సేవానియా పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే ట్రాక్ సమీపంలో ఓ వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అతడిని నరేంద్ర సాహు (35)గా గుర్తించారు. ప్రాథమిక విచారణ ప్రకారం, ఇంట్లో కుటుంబ సభ్యులను హత్య చేసిన తర్వాత అతడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.












