దేశంలోకి మందులు, వైద్య పరికరాలు, సౌందర్య సాధనాల దిగుమతులను సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రతిపాదన చేసింది. ఇందుకోసం అదనంగా 10 దిగుమతి కేంద్రాలను అనుమతుల జాబితాలో చేర్చాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే దిగుమతిదారులు తమ గోదాములు, తయారీ కేంద్రాలకు సమీపంలోనే దిగుమతి సరుకులను క్లియర్ చేసుకునే అవకాశం ఉంటుంది.
దేశంలోకి మందులు, వైద్య పరికరాలు, సౌందర్య సాధనాల దిగుమతులను మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రతిపాదన చేసింది. ఇందుకోసం అదనంగా 10 దిగుమతి కేంద్రాలను అనుమతుల జాబితాలో చేర్చాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు 1945 నాటి ఔషధ నియమాల్లోని రూల్ 43ఏకు సవరణలు ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే దిగుమతిదారులు తమ గోదాములు, తయారీ కేంద్రాలు, పంపిణీ కేంద్రాలకు సమీపంలోనే దిగుమతి సరుకులను క్లియర్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో రవాణా దూరం తగ్గడంతో పాటు ఖర్చులు ఆదా అవుతాయి. దిగుమతి చేసుకున్న మందులు, వైద్య పరికరాలు మార్కెట్‌కు చేరడంలో జాప్యం కూడా తగ్గుతుందని కేంద్రం భావిస్తోంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కేంద్రం ప్రతిపాదించిన జాబితాలో ఐదు రాష్ట్రాలకు చెందిన ప్రాంతాలు ఉన్నాయి. వీటిలో ఎనిమిది ఇన్‌ల్యాండ్ కంటైనర్ డిపోలు (ఐసీడీలు), ఒక ప్రత్యేక ఆర్థిక మండలి (ఎస్ఈజెడ్), ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నాయి. నోయిడా విమానాశ్రయం ద్వారా విమాన మార్గంలో ఔషధాల దిగుమతికి అనుమతి కల్పించాలని ప్రతిపాదించారు. రాష్ట్రం ప్రతిపాదించిన కేంద్రాలు హర్యానా సోనిపట్, పియాలా, హర్సారు ఉత్తరప్రదేశ్ దాద్రి గుజరాత్ గాంధీధామ్ / ముంద్రా తెలంగాణ సనత్‌నగర్, తిమ్మాపూర్ కర్ణాటక వైట్‌ఫీల్డ్, బొమ్మసంద్ర ప్రత్యేక ఆర్థిక మండలి ఉత్తరప్రదేశ్ నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం












