ఢిల్లీలోని ముస్తఫాబాద్‌లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఓటర్ల పేర్లను తొలగించాలంటూ సమర్పించిన 37 ఫారం-7 దరఖాస్తుల్లో 36 తప్పుడు వివరాలతో ఉన్నాయని ఎన్నికల అధికారులు గుర్తించారు. ఈ దరఖాస్తులు సమర్పించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ బూత్ స్థాయి ఏజెంట్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులకు ఎన్నికల అధికారులు ఫిర్యాదు చేశారు.
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ()పై రాజకీయ వివాదం కొనసాగుతున్న వేళ, ఢిల్లీలోని ముస్తఫాబాద్‌లో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓటర్ల పేర్లను తొలగించాలంటూ ఒక బూత్ స్థాయి ఏజెంట్ 37 ఫారం-7 దరఖాస్తులు సమర్పించారు. అయితే, వాటిని పరిశీలించిన అధికారులు 36 దరఖాస్తుల్లో పేర్కొన్న వివరాలు తప్పుగా ఉన్నాయని గుర్తించారు. పేర్లు తొలగించాలని కోరిన పలువురు ఓటర్లు వాస్తవంగా అక్కడే నివసిస్తున్నారని అధికారులు ధృవీకరించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
బీజేపీ ఏజెంట్‌పై ఆరోపణలు
సంబంధిత బూత్ ఏజెంట్ బీజేపీతో అనుబంధం కలిగిన వ్యక్తిగా ఎన్నికల రికార్డుల్లో నమోదైనట్లు నివేదికలు పేర్కొన్నాయి. అయితే, తాను బీజేపీ ఏజెంట్‌ను కాదని, దరఖాస్తులు కూడా తాను సమర్పించలేదని ఆ వ్యక్తి గతంలో చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, ఎన్నికల అధికారులు చేసిన పరిశీలన అనంతరం తప్పుడు ప్రకటనలు సమర్పించినట్లు ఆరోపిస్తూ, ప్రజాప్రాతినిధ్య చట్టం-1950లోని సెక్షన్ 31 కింద చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.










