భారత్ ఫ్యూచర్ సిటీలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ () నూతన ప్రాంగణానికి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. రూ. 200 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ ప్రాంగణం కోసం ప్రభుత్వం 20 ఎకరాల భూమి కేటాయించింది.
2009లో జవహర్లాల్ నెహ్రూ జాతీయ పట్టణ పునరుద్ధరణ మిషన్ () కింద ఎంపికైనప్పటికీ, కు రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించకపోవడంతో ఇంతకాలం ఈ ప్రాజెక్టు వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలో 20 ఎకరాలు కేటాయించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
తెలంగాణలో పట్టణ విధానాల రూపకల్పనకు, కార్యాచరణ ఆధారిత పరిశోధన సంస్థగా కీలకంగా పనిచేస్తుంది. 2025 నాటికి ప్రాంగణ నిర్మాణాన్ని పూర్తి చేసి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున ప్రారంభించుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించారు.












