హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రకాశం జిల్లా రాజుపాలెం సెంటర్ వద్ద తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో డ్రైవర్ చాకచక్యంతో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు.
ప్రకాశం జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుంచి తిరుపతికి ప్రయాణిస్తున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అయితే, డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి బస్సును రోడ్డు పక్కకు నిలిపి, ప్రయాణికులను వెంటనే కిందకు దించడంతో పెను ప్రమాదం తప్పింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ ఘటన ప్రకాశం జిల్లా మండల పరిధిలోని రాజుపాలెం సెంటర్ వద్ద జాతీయ రహదారిపై తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో జరిగింది. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తున్న కావేరీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో వెనుక టైర్ వద్ద సమస్య తలెత్తి పొగలు రావడాన్ని డ్రైవర్ గుర్తించాడు. బస్సును రోడ్డు పక్కన నిలిపి పరిశీలిస్తున్న సమయంలో టైర్ పేలి మంటలు కనిపించాయి.











