కడప జిల్లా పులివెందులలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కవరేజ్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై దాడి జరిగింది. ఆదివారం ఉదయం పోలింగ్ కేంద్రం సమీపంలో జరిగిన ఈ ఘటనలో ఇండియా టుడే ప్రతినిధి అబ్దుల్ బషీర్, వీడియో జర్నలిస్ట్ ఎస్. విజయ్ గాయపడ్డారు. పలువురు జర్నలిస్టుల కెమెరాలు ధ్వంసం చేయడంతో పాటు సెల్ఫోన్లు, గుర్తింపు కార్డులను దుండగులు లాక్కెళ్లారు.
పులివెందులలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కవరేజ్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై దాడి జరిగింది. ఆదివారం ఉదయం పోలింగ్ కేంద్రం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దాడిలో ఇండియా టుడే ప్రతినిధి అబ్దుల్ బషీర్, వీడియో జర్నలిస్ట్ ఎస్. విజయ్ గాయపడినట్లు వార్తా కథనాలు తెలిపాయి. ఎన్టీవీ విలేకరి సురేశ్ సహా ఇతర మీడియా సిబ్బందిపైనా దాడులు జరిగినట్లు సమాచారం.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కెమెరా ధ్వంసం.. ఫోన్లు, గుర్తింపు కార్డులు స్వాధీనం
హైదరాబాద్ నుంచి పులివెందులకు వెళ్లిన ఇండియా టుడే బృందం అహోబిలాపురంలోని గాంధీ విగ్రహం సమీపంలో పోలింగ్ కవరేజ్ చేస్తోంది. ఈ సమయంలో సుమారు 50 నుంచి 80 మంది వరకు ఉన్న గుర్తుతెలియని వ్యక్తులు వారిని చుట్టుముట్టినట్లు సమాచారం. తొలుత కెమెరాను లాక్కునేందుకు ప్రయత్నించగా, అడ్డుకున్న జర్నలిస్టులపై దాడికి దిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దుండగులు కెమెరాను నేలకేసి కొట్టి ధ్వంసం చేయడంతోపాటు మెమరీ కార్డు, బ్యాటరీని తొలగించినట్లు సమాచారం. జర్నలిస్టుల సెల్ఫోన్లు, గుర్తింపు కార్డులను కూడా లాక్కున్నట్లు పోలీసులు తెలిపారు.











