తెలంగాణలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా, ముసాయిదా జాబితాలో పేరు లేని అర్హులైన ఓటర్లకు ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. రాష్ట్రంలో 73.39 లక్షల మంది ఓటర్లకు ఈ వెసులుబాటు వర్తించనుంది. అర్హులైన వారు లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ () ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటరు జాబితాలో చోటు దక్కని అర్హులైన ఓటర్లకు ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. రాష్ట్రంలో గైర్హాజరు, చిరునామా మార్పు, మరణం, డూప్లికేట్ నమోదు తదితర కారణాలతో విభాగంలో చేర్చిన 73,39,235 మంది ఓటర్లకు ఈ అవకాశం వర్తించనుంది. అర్హులైన వారు లోగా తమ వివరాలను సమర్పించి తుది ఓటరు జాబితాలో పేరు చేర్చుకునేందుకు ప్రయత్నించవచ్చు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఏడు రాష్ట్రాల్లో కొత్త అవకాశం
తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా, జార్ఖండ్, నాగాలాండ్ రాష్ట్రాల్లోనూ ఈ అవకాశం కల్పించారు. గతంలో ఓటర్లకు అందించిన ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి ఎన్నికల అధికారులకు అందకపోవడంతో కొందరి పేర్లు ముసాయిదా జాబితాలో చేరలేదు. అలాంటి అర్హులైన ఓటర్లను మరోసారి సంప్రదించి వివరాలు సేకరించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.











