బేగంపేట ఐటిసి కాకతీయ హోటల్లో జరిగిన 100 వేడుకలు, తెలంగాణ డీప్‌టెక్ లీడర్షిప్ సమ్మిట్ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు.
రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో డీప్‌టెక్, సాంకేతిక ఆవిష్కరణలు కీలక పాత్ర పోషించాలని ఆయన సూచించారు. పరిశోధనలు ప్రయోగశాలలకే పరిమితం కాకుండా ప్రజలకు ఉపయోగపడే ఉత్పత్తులుగా మారాలని అన్నారు. హైదరాబాద్‌లో డీప్‌టెక్ అభివృద్ధికి అపారమైన అవకాశాలున్నాయని, సాఫ్ట్వేర్, ఫార్మా, బయోటెక్, ఏరోస్పేస్ రంగాల సమన్వయంతో ముందడుగు వేయాలని సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పరిశ్రమలు, పరిశోధకులు, ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. యువ స్టార్టప్‌లకు ఉమ్మడి పరీక్షా కేంద్రాలు, సులభతర ధ్రువీకరణ విధానాలు అందుబాటులోకి రావాలని సూచించారు. కొత్త ఆవిష్కరణలకు ప్రభుత్వం, పరిశ్రమలు అండగా నిలవాలని, విజయవంతమైన ప్రయోగాలను విస్తృతంగా అమలు చేయాలని అన్నారు.











