ఉపాధి, 4 నవంబర్ 2026
దేశంలో ఉపాధ్యాయ నియామక అర్హతలకు సంబంధించి కీలక మార్పులకు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి () చర్యలు చేపట్టింది. ఉపాధ్యాయ నియామక నిబంధనలు, , అర్హత ప్రమాణాలను సమీక్షించేందుకు రెండు నిపుణుల కమిటీలను ఏర్పాటు చేసింది. నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ () పూర్తిచేసిన అభ్యర్థుల అర్హతలపై స్పష్టత తీసుకురావడమే లక్ష్యం.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
జాతీయ విద్యా విధానం2020 ( 2020)లో భాగంగా ప్రవేశపెట్టిన నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ () ద్వారా డిగ్రీతో పాటు ఉపాధ్యాయ శిక్షణ కూడా అందిస్తున్నారు. అయితే, ఈ కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులు ప్రస్తుత ఉపాధ్యాయ నియామక నిబంధనల ప్రకారం ఏయే పోస్టులకు అర్హులనే అంశంపై స్పష్టత అవసరమైంది.












