మాజీ ముఖ్యమంత్రి దివంగత వై.ఎస్. రాజశేఖర రెడ్డి సతీమణి వై.ఎస్. విజయమ్మ, కుటుంబ ఆస్తుల పంపిణీపై స్పష్టతనిస్తూ ఒక కీలక లేఖను విడుదల చేశారు. ఈ లేఖలో, ఆస్తుల విభజన, షర్మిల వాటా, వై.ఎస్. జగన్ పాత్రపై ఆమె పలు వ్యాఖ్యలు చేశారు.
వై.ఎస్. రాజశేఖర రెడ్డి 2009లో మరణించే వరకు ఉన్న ఆస్తులన్నీ ఉమ్మడి కుటుంబ ఆస్తులుగానే పరిగణించబడతాయని విజయమ్మ తెలిపారు. ఆస్తుల విభజన ఎప్పుడూ జరగలేదని, అయితే, నలుగురు మనవళ్లు, మనవరాళ్లకు సమానంగా పంచాలన్నది వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఆకాంక్ష అని, అది ఆయన ఆదేశమని ఆమె పేర్కొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ (MOU) ప్రకారం షర్మిలకు చెందిన ప్రతి ఆస్తి చట్టబద్ధంగా ఆమెకే చెందాలని విజయమ్మ స్పష్టం చేశారు. సరస్వతి సిమెంట్స్‌తో పాటు, MOUలో పేర్కొనబడని యలహంక భూమి కూడా షర్మిలకే చెందుతుందని ఆమె వివరించారు. వై.ఎస్. జగన్ తాను ఇచ్చిన డబ్బు ఆస్తి పంపకం కాదని, అది షర్మిల వాటాకు వచ్చిన డివిడెండ్ మాత్రమేనని ఆమె తెలిపారు.










