జర్మనీలో జరిగిన హైలో ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శన చేశారు. భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్ మహిళల, పురుషుల సింగిల్స్ విభాగాల్లో విజేతలుగా నిలిచారు. ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో ఇద్దరూ వరుస గేముల్లో ప్రత్యర్థులను ఓడించి టైటిళ్లు సాధించారు.
జర్మనీలో జరిగిన హైలో ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శన చేశారు. భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్ మహిళల, పురుషుల సింగిల్స్ విభాగాల్లో విజేతలుగా నిలిచారు. ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో ఇద్దరూ వరుస గేముల్లో ప్రత్యర్థులను ఓడించి టైటిళ్లు సాధించారు. దీంతో ఈ టోర్నీలో భారత్‌కు డబుల్ సింగిల్స్ టైటిళ్లు దక్కాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు విజయం
మహిళల సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ పీవీ సింధు.. డెన్మార్క్‌కు చెందిన ఎనిమిదో సీడ్ లైన్ హోజ్మార్క్ క్జెర్స్ఫెల్ట్పై విజయం సాధించింది. 39 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో 21-12, 21-14తో ప్రత్యర్థిని ఓడించింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన సింధు.. ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు.












